ఈసారి లద్దాఖ్‌ నేతలతో అఖిలపక్ష సమావేశం..!

తాజా వార్తలు

Published : 27/06/2021 22:24 IST

ఈసారి లద్దాఖ్‌ నేతలతో అఖిలపక్ష సమావేశం..!

దిల్లీ: జమ్మూకశ్మీర్‌ అంశంపై ఇటీవల అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర సర్కారు తాజాగా లద్దాఖ్‌పై దృష్టి సారించింది. లద్దాఖ్‌ అంశంపైనా అఖిలపక్ష సమావేశం నిర్వహించడానికి సిద్ధమైంది. జులై 1న నిర్వహించబోయే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ ఇప్పటికే అక్కడి రాజకీయ పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపింది. అఖిలపక్ష సమావేశానికి తమకు ఆహ్వానం అందినట్లు కార్గిల్‌ డెమొక్రాటిక్‌ అలయన్స్‌(కేడీఏ) స్పష్టం చేసింది. అధికరణ 370, 35ఏ పునరుద్ధరణ, లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలనే రెండు ప్రధాన డిమాండ్లను సమావేశంలో కేడీఏ లేవనెత్తనుందని సమాచారం. లద్దాఖ్‌కు శాసనసభ ఏర్పాటు చేయాలంటూ స్థానిక పౌర హక్కుల సంఘాలు ఇటీవల డిమాండ్‌ చేశాయి. ఆ ప్రాంతంలో ఆరో షెడ్యూల్‌ను అమల్లోకి తీసుకురావాలని కోరాయి. ఆరో ఫెడ్యూల్‌ అమల్లోకి వస్తే అక్కడి భూములకు స్థానికులు మాత్రమే హక్కుదారులు కావడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికే ప్రాధాన్యం పెరుగుతుంది. 

జమ్మూకశ్మీర్‌ అంశంపై ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అక్కడి నుంచి హాజరైన 14 మంది రాజకీయ పార్టీల నేతలతో పలు కీలక అంశాలపై చర్చించారు. 2019లో అధికరణ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌ నేతలతో ఇలాంటి సమావేశాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి.    


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని