కేంద్రం, ట్విటర్‌కు సుప్రీం నోటీసులు

తాజా వార్తలు

Published : 12/02/2021 13:40 IST

కేంద్రం, ట్విటర్‌కు సుప్రీం నోటీసులు

దిల్లీ: సామాజిక మాధ్యమాల్లో విద్వేష వార్తల వ్యాప్తిని నియత్రించేలా వ్యవస్థ తీసుకురావాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. భాజపా నేత వినిత్‌ గొయెంకా ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. దీనిపై తమ స్పందన తెలియజేయాలంటూ ట్విటర్‌ ఇండియా, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నకలీ వార్తల వ్యవహారంపై పెండింగ్‌లో ఇతర పిటిషన్లతో కలిసి దీన్ని విచారిస్తామని సీజేఏ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. 

దేశానికి చెందిన ప్రముఖ వ్యక్తులు, ఉన్నత హోదాల్లో ఉన్నవారి పేర్లతో ట్విటర్‌, ఫేస్‌బుక్‌ మాధ్యమాల్లో వందల కొద్ది బోగస్‌ ఖాతాలున్నాయని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈ నకిలీ ఖాతాదారులు   ప్రముఖుల నిజమైన ఫొటోలను పెట్టి ఆ ఖాతాలను నుంచి మెసేజ్‌లు చేస్తుండటంతో సామాన్య ప్రజలు వాటిని నమ్ముతున్నారని తెలిపారు. ఈ బోగస్‌ ఖాతాలు విద్వేషపూరిత, రెచ్చగొట్టే వార్తలను వ్యాప్తి చేస్తున్నాయని, దిల్లీ సహా అనేక చోట్ల జరిగే అల్లర్లకు ఈ నకిలీ వార్తలే కారణమని ఆరోపించారు. 

ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం ట్విటర్‌ ఖాతాల్లో 10శాతం, ఫేస్‌బుక్‌ ఖాతాల్లో 10శాతం ఖాతాలు బోగస్‌వేనని, రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల ఇమేజ్‌ దెబ్బతీసేందుకు ఈ నకిలీ ఖాతాలను ఉపయోగించుకుంటున్నాయని పిటిషనర్‌ ఆరోపించారు. ఇలా బోగస్‌ ఖాతాల ద్వారా నకిలీ వార్తల, విద్వేషపూరిత సందేశాల వ్యాప్తిని నియంత్రించేందుకు సోషల్‌ మీడియా వేదికలు ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ న్యాయస్థానాన్ని కోరారు.  

రైతుల ఆందోళన విషయంలో ట్విటర్‌.. కేంద్ర ప్రభుత్వ అసహనానికి గురవుతున్న విషయం తెలిసిందే. రైతుల ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేలా ట్వీట్లు చేస్తున్న 1000కి పైగా ఖాతాలను బ్లాక్‌ చేయాలంటూ కేంద్రం ఇటీవల ట్విటర్‌ను ఆదేశించింది. అయితే ఇందులో కొన్నింటిని మాత్రమే తొలగించిన సామాజిక మాధ్యమ సంస్థ.. భావ ప్రకటనా స్వేచ్ఛకు తాము ప్రాధాన్యమిస్తామని ప్రకటించింది. ట్విటర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం.. భారత చట్టాలను పాటించాల్సిందేనని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఇవీ చదవండి..

భారత చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

మొబైళ్లకు అతుక్కుపోతున్నాం.. మనమే టాప్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని