కరోనా ఉద్ధృతి: ఒకేరోజు 1.61లక్షల కేసులు!
close

తాజా వార్తలు

Updated : 13/04/2021 12:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ఉద్ధృతి: ఒకేరోజు 1.61లక్షల కేసులు!

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. క్రితం రోజుతో పోలిస్తే కొవిడ్‌ కేసులు స్వల్పంగా తగ్గాయి. అంతకుముందు రోజు 1.68 లక్షల కేసులు నమోదు కాగా.. గడిచిన 24గంటల్లో 1,61,736 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. నిన్న 14 లక్షల పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,36,89,453కి చేరింది. కొత్తగా 97,168మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,22,53,697కు చేరి.. రికవరీ రేటు 89.86శాతానికి తగ్గింది.

ఇక కరోనా మరణాలు అంతకుముందు రోజు 904 నమోదు కాగా.. సోమవారం ఆ సంఖ్య కాస్త తగ్గింది. మొత్తం 879మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,71,058కి చేరింది. ఇక మరణాల రేటు 1.26 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య  12,64,698 కి పెరిగింది. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగంగా సాగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 40.04లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం టీకా అందిన వారి సంఖ్య 10,85,33,085కి చేరింది.

ఇక మహారాష్ట్రలో వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 51 వేలకుపైగా కేసులు.. 258 మరణాలు చోటుచేసుకున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని