Covid cases: దిల్లీలో 2000 దిగువకు కేసులు

తాజా వార్తలు

Published : 23/05/2021 18:45 IST

Covid cases: దిల్లీలో 2000 దిగువకు కేసులు

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 1,649 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాది మార్చి 30 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో కరోనాతో 189 మంది మృత్యువాత పడినట్లు దిల్లీ ఆరోగ్యశాఖ తెలిపింది. పాజిటివిటీ రేటు సైతం 2.42కి తగ్గినట్లు పేర్కొంది.

దిల్లీలో మార్చి 30న 992 కేసులు నమోదు కాగా.. ఏప్రిల్‌ 1న 2,790 కేసులు వెలుగు చూశాయి. అనంతరం భారీగా కొత్త కేసులు, మరణాలు సంభవించాయి. కేజ్రీ సర్కారు విధించిన లాక్‌డౌన్‌ ప్రభావంతో కొద్ది రోజులుగా కేసుల కొండ కరుగుతోంది. గత మూడు రోజులుగా 3వేలకు పైగా కేసులు నమోదవ్వగా.. తొలిసారి 2 వేలలోపు కేసులు వెలుగుచూశాయి. ఇప్పటి వరకు దిల్లీలో 23,202 మంది మృత్యువాతపడ్డారు. మరోవైపు కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ వైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌ను మాత్రం కొనసాగిస్తున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆదివారం ప్రకటించారు. చాలా మంది ప్రజలు లాక్‌డౌన్‌ పట్ల సుముఖంగా ఉన్న నేపథ్యంలో మే 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. దిల్లీలో ప్రజలందరికీ వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ వేసేందుకు వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని