సెప్టెంబర్‌ నాటికి పిల్లలకు కొవిడ్‌టీకా..!
close

తాజా వార్తలు

Published : 06/05/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెప్టెంబర్‌ నాటికి పిల్లలకు కొవిడ్‌టీకా..!

 సిద్ధమవుతున్న ఫైజర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫార్మా దిగ్గజం ఫైజర్‌ ఇప్పుడు చిన్న పిల్లలకు కరోనా టీకా తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. వచ్చే సెప్టెంబర్‌ నాటికి ఆ టీకా వినియోగానికి అత్యవసర అనుమతులు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ టీకాను 2 ఏళ్ల నుంచి 11 ఏళ్ల మధ్యలోని వారికి వాడే అవకాశం ఉన్నట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే సిద్ధం చేసిన టీకాను 12 ఏళ్ల నుంచి 15 ఏళ్లలోపు వారి టీకాకు వచ్చే వారం అమెరికా ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు మంజూరయ్యే అవకాశం ఉంది. 

ఇక 16 ఏళ్ల నుంచి 85 ఏళ్ల మధ్యలోని వారికి వినియోగించే టీకాకు పూర్తి స్థాయి అనుమతులు ఈ నెలలో వచ్చే అవకాశం ఉందని ఆంగ్లవార్త పత్రిక న్యూయార్క్‌టైమ్స్‌ పేర్కొంది. గర్భిణుల కోసం అభివృద్ధి చేసిన టీకా సురక్షిత ప్రమాణాలు, క్లీనికల్‌ ప్రయోగాల డేటాను ఆగస్టు మొదటి వారం నాటికి సిద్ధం చేసే అవకాశం ఉంది. 

మరోపక్క అమెరికా ప్రభుత్వం కూడా అన్ని వర్గాల వారికీ టీకాలను అందుబాటులోకి తెచ్చే యత్నాలు చేస్తోంది. దీనిపై అమెరికా శ్వేతసౌధ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌సాకీ మాట్లాడుతూ ‘‘కొవిడ్‌ వ్యాక్సిన్‌ను యువతకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఎఫ్‌డీఏ ప్రయత్నాలు చేస్తోంది’’ అన్నారు. ప్రస్తుతం ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ టీకాను అత్యవసర వినియోగ అనుమతులపై విడుదల చేశారు. దీనిని అమెరికాలో పెద్దలకు ఇస్తున్నారు. కానీ, దీనికి పూర్తి అనుమతులు త్వరలో ఎఫ్‌డీఏ ఇవ్వనుంది. అప్పుడు దీనిని వినియోగదారులు నేరుగా కొనుగోలు చేసి వాడుకోవచ్చు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని