యూజీ, పీజీ విద్యార్థులకు మార్గదర్శకాలు
close

తాజా వార్తలు

Updated : 12/04/2021 22:06 IST

యూజీ, పీజీ విద్యార్థులకు మార్గదర్శకాలు

దిల్లీ: ఓ వైపు పరీక్షల సమయం దగ్గర పడుతోంది. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు అరకొరగా మాత్రమే సిలబస్‌లు పూర్తయ్యాయి.పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు విద్యార్థులు తికమక పడుతున్నారు. అసలు పరీక్షలు నిర్వహిస్తారో? లేదో అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీ యూనివర్సిటీ యూజీ, పీజీ విద్యార్థులకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆన్‌లైన్‌లోనే తరగతులు ఉంటాయని పేర్కొంది. అయితే.. రీసెర్చ్‌ స్కాలర్లు, ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు మాత్రం కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ప్రత్యక్ష తరగతులకు హాజరుకావొచ్చు. ఈ మార్గదర్శకాలు దిల్లీ క్యాంపస్‌తోపాటు యూనివర్సిటీ అనుబంధ కళాశాల్లోనూ అమలు చేయనున్నారు.

కళాశాల సిబ్బందిలో 50 శాతం మంది మాత్రమే హాజరు కావాలని, మిగతా వారి ఇంటి నుంచే  పని చేయాలని దిల్లీ యూనివర్సిటీ మార్గదర్శకాల్లో పేర్కొంది. విద్యార్థులు, సిబ్బంది కంటైన్‌మెంట్‌ జోన్‌ వివరాలను ఎప్పటికప్పుడు కళాశాలకు అందివ్వాలని తెలిపింది.

మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశముంది. ఇతర పోటీ పరీక్షలు, ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవసరమైన ప్రవేశపరీక్షలు రాసేందుకు వీళ్లంతా అర్హత కోల్పోయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని వర్సిటీల యాజమాన్యాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయన్న దానిపై సందిగ్ధత నెలకొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని