Mehul Choksi: మెహుల్‌ చోక్సీ అదృశ్యం

తాజా వార్తలు

Updated : 25/05/2021 05:52 IST

Mehul Choksi: మెహుల్‌ చోక్సీ అదృశ్యం

న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ) కుంభకోణం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీ అదృశ్యమయ్యారు. అంటిగ్వా దీవిలో తలదాచుకుంటున్న చోక్సీ ఆదృశ్యమైనట్లు ఆయన న్యాయవాది విజయ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. చోక్సీ అదృశ్యం నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అక్కడి ప్రముఖ  రెస్టారెంట్‌లో విందు కోసం చోక్సీ నిన్న సాయంత్రం వెళ్లినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. చోక్సీ వాహనాన్ని రెస్టారెంట్‌ సమీపంలోని జాలీ హార్బర్‌లో గుర్తించినట్లు అంటిగ్వా పోలీసులు వెల్లడించారు. దీంతో అంటిగ్వా పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారు. 2017లో మెహుల్‌ చోక్సీ అంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకున్నారు. 2018లో పీఎన్‌బీ కుంభకోణం బయటపడడంతో నీరవ్‌మోదీతోపాటు మెహుల్‌ చోక్సీ దేశం విడిచి పరారయ్యాడు. నీరవ్‌ మోదీకి మెహుల్‌ చోక్సీ మేనమామ అవుతారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని