నిర్భయ దోషుల ఉరికి ట్రయల్స్‌

తాజా వార్తలు

Updated : 08/01/2020 16:07 IST

నిర్భయ దోషుల ఉరికి ట్రయల్స్‌

దిల్లీ: నిర్భయ దోషులకు మరణశిక్ష అమలు చేసేందుకు కసరత్తు మొదలైంది. ఇందులో భాగంగా ఉరి శిక్షను అమలు చేసేందుకు జైలు సిబ్బంది ట్రయల్స్‌ నిర్వహించనున్నట్లు తిహార్‌ జైలు అధికారులు వెల్లడించారు. దోషులు ఎంత బరువు ఉంటారో అంత బరువు ఉండే వస్తువులను ఉపయోగించి ఉరి ట్రయల్స్‌ వేయనున్నారు. తిహార్‌ జైల్లోని మూడో నంబరు కారాగారంలో ఉరి శిక్షకు సంబంధించిన ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. అయితే ఇవి ఎప్పుడు నిర్వహించేది మాత్రం అధికారులు తెలియజేయలేదు. 

‘నిర్భయ దోషులకు ఉరి వేసేందుకు ట్రయల్స్‌ నిర్వహిస్తాం. అయితే అది ఈరోజు మాత్రం కాదు. జైలు నంబరు 3లో ఇది జరుగుతుంది’ అని జైలు వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఈ డ్రిల్‌లో పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు, జైలు సూపరింటెండెంట్‌, ఇతర అధికారులు పాల్గొననున్నారు. 2013లో పార్లమెంటుపై దాడి దోషి అఫ్జల్‌ గురును జైలు నంబరు 3లోనే ఉరి తీశారు. ఇప్పుడు నిర్భయ దోషులకు కూడా ఇక్కడే ఉరి శిక్ష విధించనున్నారు. దేశంలోనే తొలిసారిగా నలుగురిని ఒకేసారి ఉరి తీయనున్నారు. వారిని ఉరి తీసేందుకు బక్సర్‌ నుంచి తాళ్లను తెప్పించినట్లు తెలుస్తోంది. నిర్భయ దోషులకు డెత్‌ వారెంట్‌ జారీ చేస్తూ నిన్న దిల్లీ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈనెల 22న ఉదయం ఏడు గంటలకు తిహార్‌ జైల్లో వీరికి మరణశిక్ష అమలు చేయాలంటూ డెత్‌ వారెంట్‌ జారీ చేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని