హిమపాతం వస్తోంది.. వెనక్కు వెళ్లండి..

తాజా వార్తలు

Updated : 15/01/2020 12:59 IST

హిమపాతం వస్తోంది.. వెనక్కు వెళ్లండి..

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో మంచుతో నిండిన ప్రకృతి అందాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అయితే గత కొంత కాలంగా కురుస్తున్న మంచు కారణంగా రహదారులన్నీ మూసుకుపోవటంతో రాకపోకలకు తీవ్ర అవాంతరాలు ఏర్పడుతున్నాయి. తాజాగా కొందరు పర్యాటకులు కిన్నౌర్‌ జిల్లాలోని టింకు నల్లా ప్రాంతంలో అందాలను తిలకించేందుకు వెళ్లారు. అయితే వారు రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంచు చరియలు రోడ్డుపై పడ్డాయి. వాటిని చూసేందుకని వాహనాల నుంచి కిందకు దిగిన వారి వైపుకు మంచు చరియలు రావడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ దృశ్యాన్ని వారు తమ కెమెరాల్లో బంధించే ప్రయత్నం చేశారు. అయితే మంచు వారిని వెంటాడుతున్నట్లుగా మరింత ముందుకు రావడంతో వారిలో ఒక పర్యాటకుడు వెనక్కి పో అంటూ అరిచాడు. అది మరింత ముందుకు రావడంతో భయంతో కొంతమంది తమ వాహనాలు ఎక్కి కూర్చున్నారు. మరికొందరు మాత్రం కదులుతున్న మంచు చరియను తమ కెమెరాల్లో వీడియో తీస్తూ వెనక్కి పరిగెత్తారు. దీనికి సంబంధించిన వీడియోని నవీద్ ట్రుంబో అనే ఐఆర్‌ఎస్ అధికారి తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఇంతక ముందెన్నడూ ఇలా మంచు చరియలు కదలడం చూడలేదని అన్నారు.

 

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని