కశ్మీర్‌లో సత్వరమే ఆంక్షలు ఎత్తివేయాలి

తాజా వార్తలు

Updated : 14/02/2020 20:22 IST

కశ్మీర్‌లో సత్వరమే ఆంక్షలు ఎత్తివేయాలి

పర్యటన అనంతరం ఈయూ ప్రకటన జారీ

దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సానుకూలమైన చర్యలను భారత ప్రభుత్వం చేపట్టిందని విదేశీ రాయబారుల బృందం తెలిపింది. అయితే, అక్కడ అమలులో ఉన్న ఆంక్షలను వీలైనంత వేగంగా ఎత్తివేయడం ముఖ్యమని శుక్రవారం అభిప్రాయపడింది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో స్థితిగతులు, భద్రతా పరమైన అంశాలను పరిశీలించేందుకు విదేశీ రాయబారుల బృందం రెండు రోజుల పాటు పర్యటించిన విషయం తెలిసిందే. యూరోపియన్‌ యూనియన్‌ సహా జర్మనీ, కెనడా, ఫ్రాన్స్‌, ఇటలీ, పొలాండ్‌, న్యూజిలాండ్‌, మెక్సికో, అఫ్గానిస్థాన్‌, ఆస్ట్రేలియా, ఉబ్జెకిస్థాన్‌ తదితర దేశాలకు చెందిన  25 మంది రాయబారులు శ్రీనగర్‌, జమ్మూలలో పర్యటించారు. 

ఈ పర్యటన అనంతరం ఈయూ విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి  శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. భారత ప్రభుత్వం కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అవసరమైన సానుకూల చర్యలను తీసుకున్నట్టు పేర్కొన్నారు. అలాగే, ఇంకా ఇంటర్నెట్‌, మొబైల్‌ సర్వీసులపై విధించిన ఆంక్షలతో పాటు కొందరు రాజకీయ నాయకులు నిర్బంధంలోనే ఉన్నట్టు గుర్తించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. భద్రతాపరమైన సమస్యలు ఉన్నట్లు గుర్తించామనీ.. అయితే, వీలైనంత త్వరగా మిగతా ఆంక్షలను కూడా ఎత్తివేయడం ముఖ్యమని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని