అమెరికాలో పులికి కరోనా: భారత్‌లో అప్రమత్తత

తాజా వార్తలు

Published : 06/04/2020 22:07 IST

అమెరికాలో పులికి కరోనా: భారత్‌లో అప్రమత్తత

దిల్లీ: మనుషుల నుంచి జంతువులకు కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యానవనాలు, జంతు ప్రదర్శనశాలలు, పక్షి సంరక్షణ కేంద్రాలు, అభయారణ్యాల్లో మనుషుల కదలికలను కట్టడి చేయాలని ఆదేశించింది. అమెరికాలోని ఓ జంతుప్రదర్శన శాలలో పులికి కొవిడ్-19 సోకడంతో ముందు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టింది.

‘దేశంలో కొవిడ్‌-19 వ్యాపిస్తోంది. అమెరికాలో ఓ పులికి వైరస్‌ సోకిందని వార్తలు వచ్చాయి. అంటే మనుషుల నుంచి జంతువులకు వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. ఈ సంక్రమణను అడ్డుకొనేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జంతువులు ఉండే చోటుకు మనుషులు రాకుండా అన్ని చర్యలు చేపట్టాలి. అవసరమైతే జంతువులకు వైద్య సేవలు అందించి తిరిగి వాటి ఆవాసాలకు పంపించేలా ఏర్పాట్లు చేయండి. ఫీల్డ్‌ మేనేజర్లు, పశు వైద్యులు, సిబ్బందితో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ను కొనసాగించండి. జంతు పర్యవేక్షణ వ్యవస్థను నెలకొల్పండి’ అని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

అమెరికాలో పులికి వైరస్‌ సోకడంతో జీవాల నమూనాలను ప్రతి 15 రోజులకు పరీక్షించాలని సెంట్రల్‌ జూ అథారిటీ (జీజడ్‌ఏ) దేశంలోని అన్ని జంతు ప్రదర్శనశాలలను ఆదేశించింది. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని