ఇజ్రాయిల్‌ ప్రధాని అవినీతి ఆరోపణలపై విచారణ!

తాజా వార్తలు

Published : 24/05/2020 16:35 IST

ఇజ్రాయిల్‌ ప్రధాని అవినీతి ఆరోపణలపై విచారణ!

జెరూసలేం: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమన్‌ నెతన్యాహుపై నమోదైన కేసులపై నేడు విచారణ ప్రారంభంకానుంది. ఈ విచారణ తొలిరోజులో భాగంగా ఆదివారం నాడు జెరూసలేం జిల్లా కోర్టుకు ఇజ్రాయిల్‌ ప్రధాని హాజరు కావాల్సి ఉంది. అయితే, అధికారంలో ఉండి నేర విచారణ ఎదుర్కొంటున్న తొలి ఇజ్రాయిల్‌ ప్రధాని ఈయనే. లంచం, మోసం, విశ్వాస ఘాతుకం వంటి ఆరోపణలపై నెతన్యాహుపై మూడు కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా సంపన్న వర్గాలకు చెందిన స్నేహితుల నుంచి ఖరీదైన బహుమతులు స్వీకరించారనే అభియోగాలు ఉన్నాయి. వీటితోపాటు మీడియా సంస్థల అధినేతలకు సానుకూలంగా వ్యవహరించి సహాయం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణను ఆదివారం ప్రారంభించనుంది. కాగా తొలి రోజు విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును కోరగా.. నెతన్యాహు అభ్యర్ధనను ధర్మాసనం గత బుధవారమే తోసిపుచ్చింది.

నెతన్యాహు తిరిగి ఐదో సారి ప్రధానమంత్రిగా అధికారం చేపట్టిన కేవలం వారం రోజుల్లోనే ఈ విచారణను ఎదుర్కోవడం గమనార్హం. ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్‌ మాజీ ప్రధాని ఎహుద్‌ ఓల్మర్ట్‌ లంచం తీసుకున్న కేసులో 16నెలలు జైలుపాలయ్యాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని