ఆకలి రాజ్యం: రైల్వేస్టేషన్‌లో ఆహారం లూటీ

తాజా వార్తలు

Published : 26/05/2020 01:57 IST

ఆకలి రాజ్యం: రైల్వేస్టేషన్‌లో ఆహారం లూటీ

భోపాల్‌: కరోనా వైరస్‌ విజృంభణ.. లాక్‌డౌన్‌.. ఉపాధి కోల్పోవడం వెరసి వలస కూలీలు, చిరు ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారస్థుల పాలిట శరఘాతమై కూర్చొంది. వీరిలో వలస కూలీల పరిస్థితి మరింత దయనీయం. పని చేస్తే కానీ, పట్టెడన్నం తినే వీరు పని దొరక్క పస్తులున్నారు. స్వగ్రామాలకు కాలినడకన బయలుదేరారు. ఇక వలస కూలీల కోసం ప్రభుత్వం శ్రామిక రైళ్లను నడుపుతున్నా, ప్రయాణం సమయంలో సరిగా ఆహారం దొరకని పరిస్థితి. అలాంటి దయనీయ పరిస్థితికి ఉదాహరణే ఈ వీడియో.

సొంతూళ్లకు వెళ్లేందుకు పలువురు వలస కూలీలు మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం డివిజన్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు.  శ్రామిక్‌ ప్రత్యేక రైలు ఎక్కేందుకు వచ్చిన వీరంతా అక్కడకు వచ్చారు. ఆ రైలులో ప్రయాణించే వలస కూలీలకు అందించడానికి ప్యాక్‌ చేసిన ఆహారం, బ్రెడ్‌ మొదలైనవి అధికారులు ఒక ట్రాలీలో వేసుకొచ్చారు. అది చూసిన వెంటనే వలస కూలీలు దాని చుట్టూ గుమిగూడారు. రైలు ప్రయాణ సమయంలో ఇవ్వడానికి తెచ్చిన ఆహారమని ఇప్పుడు ఇవ్వమని అధికారులు చెప్పినా, ఒకరిద్దరు కూలీలు ధైర్యం చేసి ఆ ఆహారం ప్యాకెట్లను తీసుకున్నారు. అక్కడే ఉన్న మిగిలిన కూలీలు కూడా ఒక్కసారిగా ట్రాలీపై పడి, ఎవరి చేతికి దొరికిన ఆహారాన్ని వారు లాక్కునిపోయారు. ఒకరి చేతిలో ఉన్న ఆహారాన్ని మరొకరు తీసుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా పలువురి మధ్య తోపులాట జరిగింది. ఈ చర్యతో ఒక్కసారిగా షాకైన అధికారులు వారి నుంచి దూరంగా జరిగిపోయారు. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ లేని సమయంలో ఇది జరిగిందని అధికారులు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని