అమెరికాపై ఎదురుదాడికి దిగిన చైనా!

తాజా వార్తలు

Published : 01/06/2020 18:28 IST

అమెరికాపై ఎదురుదాడికి దిగిన చైనా!

అంతర్గత విషయంలో జోక్యాన్ని సహించమని హెచ్చరిక..!

బీజింగ్‌: హాంగ్‌కాంగ్‌ విషయంలో జోక్యం చేసుకుంటున్న అమెరికాపై తాజాగా చైనా ఎదురుదాడికి దిగింది. హాంగ్‌కాంగ్‌లో జాతీయ భద్రతా చట్టాన్ని అమలుచేయాలని ప్రయత్నిస్తున్న చైనాపై చర్యలు తప్పవని ఈ మధ్యే ట్రంప్‌ స్పష్టం చేశారు. హాంగ్‌కాంగ్‌కు ఎంతోకాలంగా గర్వకారణంగా ఉన్న హోదాను చైనా ప్రభుత్వం అణచివేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. దీనిలో భాగంగా చైనా విద్యార్థులపై ఆంక్షలు విధిస్తామని ట్రంప్‌ ప్రకటించారు. దీనిపై తాజాగా చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఇది ఇరువైపుల హానికలిగించే చర్యగా పేర్కొంది. చైనా ప్రయోజనాలకు హానికలిగించే ఎలాంటి చర్యలు, మాటలున్నా తీవ్ర ప్రతిఘటన ఉంటుందని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్‌ హెచ్చరించారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో తలదూరుస్తున్న అమెరికా చర్యల కారణంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించాయని తెలిపారు.

ఇదిలా ఉంటే, హాంగ్‌కాంగ్‌లో జాతీయ భద్రతా చట్టాన్ని అమలుచేయాలని చైనా ప్రతిపాదించిన చట్టానికి అక్కడి పార్లమెంట్‌ ఆమోదించింది. దీన్ని వ్యతిరేకిస్తూ హాంగ్‌కాంగ్‌లో ఇప్పటికీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని