14న తెరుచుకోనున్న శబరిమల ఆలయం

తాజా వార్తలు

Published : 11/06/2020 01:17 IST

14న తెరుచుకోనున్న శబరిమల ఆలయం

తిరువనంతపురం: అయ్యప్ప కొలువుదీరిన శబరిమల ఆలయం జూన్‌ 14న తెరుచుకోనుంది.  ఆ రోజు ఆలయంలో నెలవారీ పూజలు నిర్వహించనున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎన్‌ వాసు వెల్లడించారు. జూన్‌19 నుంచి ఆలయ వార్షికోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వర్చువల్‌ క్యూ సిస్టమ్‌లో నమోదు చేసుకున్న భక్తులకు ఆలయానికి అనుమతివ్వనున్నట్లు తెలిపారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు రిజిస్ట్రేషన్‌ సమయంలో తప్పనిసరిగా కొవిడ్‌-19 నెగెటివ్‌ సర్టిఫికెట్‌ అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని వాసు వెల్లడించారు. ఐసీఎంఆర్‌ గుర్తింపు పొందిన ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహిస్తేనే అనుమతిస్తామని పేర్కొన్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతిస్తున్నామని.. పంప, సన్నిధానం వద్ద స్క్రీనింగ్‌ నిర్వహించనున్నామని తెలిపారు. భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. మరోవైపు ఆలయ ప్రధాన అర్చకుడు మాత్రం కొవిడ్‌-19 కారణంగా ఈ తేదీలను వాయిదా వేయాలని కోరుతున్నారు. ఇదే విషయాన్ని దేవస్థానం బోర్డుకు తెలియజేసినట్లు చెప్పారు. బోర్డు అధ్యక్షుడు మాత్రం అలాంటి లేఖ ఏదీ తనకు రాలేదని, అన్ని వర్గాలతో చర్చించాకే తేదీలను ఖరారు చేశామని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని