పబ్లిక్‌ టాయిలెట్లతో జర భద్రం!
close

తాజా వార్తలు

Published : 23/04/2021 12:09 IST

పబ్లిక్‌ టాయిలెట్లతో జర భద్రం!

అక్కడి గాలితుంపర్లతో కరోనా ముప్పు
 హెచ్చరించిన అమెరికా శాస్త్రవేత్తలు

న్యూయార్క్‌: ఎక్కువమంది వెళ్లే మూత్రశాలలను, మరుగుదొడ్లను వినియోగించేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు... ఫ్లోరిడా అట్లాంటిక్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు! మరుగుదొడ్డిలో ఫ్లష్‌ ద్వారా నీళ్లు కొట్టేటప్పుడు వేల సంఖ్యలో గాలితుంపర్లు విడుదలవుతాయని, వాటి ద్వారా కరోనా సహా రకరకాల వైరస్‌లు సోకే ప్రమాదముందని వారు కనుగొన్నారు. సాధారణ మరుగుదొడ్లు, మూత్రశాలల్లో ఫ్లష్‌ల కారణంగా గాలితుంపర్లు ఏ స్థాయిలో, ఏయే పరిమాణాల్లో విడుదల అవుతాయి? వాటి ద్వారా వైరస్‌లు ఎలా సోకుతాయి? అనే విషయమై ఇటీవల పరిశోధన సాగించారు. నిజానికి మాట్లాడినా, తుమ్మినా, దగ్గినా, చీదినా... అత్యంత సూక్ష్మస్థాయి గాలితుంపర్లు శరీరం నుంచి విడుదలవుతాయి. వాటి ద్వారా వైరస్‌లు పరిసరాల్లోకి ప్రవేశిస్తాయి. ఆ సమయంలో సమీపాన ఎవరైనా మాస్కు పెట్టుకోకపోతే ఈ సూక్ష్మక్రిములు వారికి సోకుతాయి. ‘‘మలమూత్రాలు, వాంతుల ద్వారా కూడా మనిషి శరీరం నుంచి వైరస్‌లు బయటకు వస్తాయి. ఈ ప్రక్రియలు ముగిసిన తర్వాత ఫ్లష్‌ ద్వారా నీటిని వదిలేటప్పుడు అసంఖ్యాకంగా గాలితుంపరలు విడుదలవుతాయి. మలమూత్రాల్లోని వైరస్‌లతో కలిసి అవి ఆయా గదుల్లో ఐదు అడుగుల ఎత్తువరకూ ఎగురుతాయి. వాటి పరిమాణం, గాలి ప్రసరణను బట్టి కనీసం 20 సెకెన్ల పాటు అవి ప్రయాణం సాగిస్తాయి’’ అని పరిశోధనకర్త సిద్ధార్థ వర్మ వివరించారు. పబ్లిక్‌ టాయిలెట్లను వినియోగించేటప్పుడు తప్పకుండా మాస్కు ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం, మరుగుదొడ్డి కుండీపై మూతవేసిన తర్వాత ఫ్లష్‌ వినియోగించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని కొంతవరకూ అడ్డుకోవచ్చు’’ అని నిపుణులు సూచించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఫిజిక్స్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌ పత్రిక అందించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని