Germany: జర్మనీలో జల విలయం 

తాజా వార్తలు

Updated : 17/07/2021 19:46 IST

Germany: జర్మనీలో జల విలయం 

వరదల తీవ్రతకు 100 మందికి పైగా మృత్యువాత 
 బెల్జియంలో 18 మంది దుర్మరణం 

బెర్లిన్‌: జల విలయంతో జర్మనీ అల్లాడుతోంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో ఆ దేశంలో 100 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. బెల్జియంలోనూ వరదల బీభత్సం కొనసాగుతోంది. అక్కడ మృతుల సంఖ్య 18కి పెరిగింది. జర్మనీలో ప్రధానంగా రైన్‌లాండ్‌-పలాటినేట్, రైన్‌-వెస్ట్‌ఫాలియా రాష్ట్రాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటికే రైన్‌లాండ్‌-పలాటినేట్‌లో 60 మంది, రైన్‌-వెస్ట్‌ఫాలియాలో 43 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. జర్మనీలో గల్లంతైనవారిలో దాదాపు 1,300 మంది జాడ ఇంకా తెలియరాలేదు. వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరదల తీవ్రతకు వేల మంది నిరాశ్రయులయ్యారు. బెల్జియంలో 19 మంది గల్లంతయ్యారు. అక్కడ సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఇటలీ బలగాలను పంపించింది. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని