close

తాజా వార్తలు

Published : 12/04/2021 14:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గుట్టలుగా వాడిన మాస్కులు..మహారాష్ట్రలో ఘోరం!

జలగావ్‌: కరోనా కట్టడికి ప్రధాన ఆయుధమైన మాస్కును వాడిన వెంటనే మూత ఉన్న చెత్తడబ్బాలో వేయాలనేది నిపుణుల సూచన. అవన్నీ మాకెందుకు వాటితో కూడా మేం వ్యాపారం చేస్తామంటుంది ఓ పరుపుల తయారీ సంస్థ. అందుకే పరుపులను నింపేందుకు పత్తికి బదులు.. వాడిన మాస్కులను వినియోగిస్తోంది. మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాలో పారిశ్రామిక వాడలోని ఓ సంస్థ నిర్వాకమిది. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు సంస్థపై దాడి చేసి, యజమానిపై కేసు నమోదు చేశారు.

‘పారిశ్రామిక వాడలోని ఓ సంస్థలో వాడిన మాస్కులను పరుపుల్లో కూర్చడానికి ఉపయోగిస్తున్నట్లు సమాచారం అందింది. అధికారులు దాడి చేసినప్పుడు ఈ విషయం బయటపడింది’ అని అదనపు ఎస్పీ చంద్రకాంత్ గవాలీ మీడియాకు వెల్లడించారు. అలాగే సదరు సంస్థ యజమాని అజ్మద్ అహ్మద్ మన్సూరీపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. అంతేగాకుండా నిబంధల ప్రకారం గుట్టలుగా పడిఉన్న వాడిన మాస్కులను కాల్చివేసిట్లు తెలుస్తోంది. 

కరోనా కారణంగా భారత్‌లో మాస్కుల ఉత్పత్తి, వాడకం భారీగా పెరిగింది. దాంతో మనదేశంలో వైరస్ నుంచి రక్షణ కోసం వాడుతున్న తొడుగుల వ్యర్థాల నిర్వహణ సవాలుగా మారింది. 2020 జూన్ నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో 18వేల టన్నుల బయో మెడికల్ వ్యర్థాలు(మాస్క్‌లు, గ్లౌజులు తదితరాలు)పేరుకుపోయినట్లు కాలుష్య నియంత్రణ మండలి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు, భారత్‌ను రెండో దశ తీవ్రంగా వేధిస్తోంది. తాజాగా 1,68,912 కొత్త కేసులు నమోదు కాగా..904 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని