close

తాజా వార్తలు

ఈ బిల్లుతో ఎంతో మందికి ఉపశమనం: మోదీ

దిల్లీ: పౌరసత్వ చట్ట సవరణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ఈరోజు దేశ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. పార్లమెంటు ఉభయసభల్లో పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందడంతో ఈ మేరకు ఆయన ట్విటర్‌లో స్పందించారు. ఈ రోజు మన దేశంలో సోదరభావం వెల్లివిరిసిందన్నారు. బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిన ఎంపీలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా హింసను ఎదుర్కొన్న ఎంతోమందికి ఈ బిల్లు సాంత్వన కలిగిస్తుందని పేర్కొన్నారు.

పౌరసత్వ చట్ట సవరణ బిల్లు(సీఏబీ)కు బుధవారం రాజ్యసభలో మెజారిటీ సభ్యులు మద్దతు తెలపడంతో ఆమోదం పొందినట్లు ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. బిల్లుకు అనుకూలంగా 125 మంది, వ్యతిరేకంగా 99 మంది ఓట్లు వేశారు. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.