ఆ 3 నగరాల్లో ఆదివారం లాక్‌డౌన్‌! 

తాజా వార్తలు

Published : 20/03/2021 01:37 IST

ఆ 3 నగరాల్లో ఆదివారం లాక్‌డౌన్‌! 

భోపాల్‌: కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి‌ కట్టడికి చర్యలు చేపట్టింది. ఈ నెల 21 ఆదివారం రోజున మూడు నగరాల్లో లాక్‌డౌన్‌ విధించాలని సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నిర్ణయించారు. రాష్ట్రంలోని పలు నగరాల్లో పెద్ద సంఖ్యలో కేసులు వెలుగుచూస్తుండటంతో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలోని ఇండోర్‌, భోపాల్‌, జబల్‌పూర్‌ నగరాల్లో ఒక్కరోజు లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించారు. అలాగే, ఈ నెల 31 వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయనున్నారు. 

మరోవైపు, మధ్యప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో 1140 కేసులు, ఏడు మరణాలు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,73,097కి చేరింది. వీరిలో 2,62,587 మంది కోలుకోగా.. 3901మంది మృతిచెందారు. ప్రస్తుతం 6609 క్రియాశీల కేసులు ఉన్నాయి. వీటిలో ఇండోర్‌లో అత్యధికంగా 1960 ఉండగా.. భోపాల్‌లో 1492, జబల్‌పూర్‌లో 401 చొప్పున  యాక్టివ్‌ కేసులు కేసులు ఉన్నాయి. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని