Health: దేశంలోని 18 శాతం వృద్ధులకే ఆరోగ్య బీమా
close

తాజా వార్తలు

Published : 14/06/2021 23:58 IST

Health: దేశంలోని 18 శాతం వృద్ధులకే ఆరోగ్య బీమా

ఐఐటీ మద్రాసు పరిశోధనలో వెల్లడి

చెన్నై: భారత్‌లోని 18.9 శాతం మంది వృద్ధులకే ఆరోగ్య బీమా అందుబాటులో ఉందని ఐఐటీ మద్రాసు ఒక అధ్యయనంలో వెల్లడించింది. కరోనా సమయంలో వృద్ధులకు అందుతున్న ఆరోగ్య వసతులు, వారి ఆర్థిక పరిస్థితులపై ఐఐటీ మద్రాసుకు చెందిన పరిశోధకులు ఒక సర్వేను నిర్వహించారు. తాజాగా ఈ పరిశోధనా పత్రాలు గ్లోబలైజేషన్‌ అండ్‌ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 75వ నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆధారంగా ఈ పరిశోధనను నిర్వహించినట్లు పరిశోధకులు తెలిపారు. దేశంలోని 18.9 శాతం మంది వృద్ధులు బీమా సహాయంతో అనారోగ్యాలకు చికిత్స పొందుతున్నారని ఆ పరిశోధనలో వెల్లడైంది. మరోవైపు 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వృద్ధుల్లో 27.5 శాతం మంది ఆర్థికంగా స్థిరంగా ఉండగా, మరో 70 శాతం మంది ఇతరులపై ఆధారపడుతున్నట్లు వారు తెలిపారు. ఐఐటీ మద్రాసుకు చెందిన ప్రొఫెసర్‌ మురళీధరన్‌, డాక్టర్‌ అలోక్‌ రంజన్‌  ఈ పరిశోధన నిర్వహించినట్లు తెలిపారు.

కరోనా కారణంగా అనేక మంది వృద్ధులు ఒంటరితనంతో బాధపడుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. అంతే కాకుండా బలహీనమైన రోగనిరోధక శక్తితో పాటు డయాబెటిస్‌, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా 8,077 గ్రామాలు, 6,181 పట్టణాల్లో ఈ సర్వేను నిర్వహించినట్లు పరిశోధకులు వెల్లడించారు. అనేక కారణాలతో వృద్ధులు అసమానతలను ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. ఈ పరిశోధన ద్వారా కరోనా సమయంలో ఇబ్బందులు పడే అనేక మంది వృద్ధుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు ప్రొఫెసర్‌ మురళీధరన్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని