పీఎంకేర్స్ ​నిధులతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ​ప్లాంట్లు

తాజా వార్తలు

Updated : 25/04/2021 16:12 IST

పీఎంకేర్స్ ​నిధులతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ​ప్లాంట్లు

దిల్లీ: దేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరతను అధిగమించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా 551 పీఎస్ఏ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం పీఎం కేర్స్ నిధులను వినియోగించనుంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. 

అన్ని జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. వీలైనంత త్వరగా ప్లాంట్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ఆక్సిజన్ ప్లాంట్లతో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులలో నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా జరుగుతుందని కేంద్రం పేర్కొంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని