Imran Khan: ఇమ్రాన్‌పై సైన్యం ఆధిపత్యం

తాజా వార్తలు

Published : 22/10/2021 21:29 IST

Imran Khan: ఇమ్రాన్‌పై సైన్యం ఆధిపత్యం

ఇంటర్నెట్‌డెస్క్‌: పాక్‌ ఇంటర్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) చీఫ్‌ నియామకం విషయంలో సైన్యాధిపతి కమర్‌ జావెద్‌ బజ్వా, ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మధ్య నెలకొన్న వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. సైన్యం ఒత్తిడికి ఇమ్రాన్‌ తలొగ్గాల్సి వచ్చింది. శనివారం నుంచి మూడు రోజుల పాటు ఇమ్రాన్‌ ఖాన్‌  సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్నారు. అంతకు ముందే లెఫ్టినెంట్‌ జనరల్‌ నదీం అంజుమ్‌ను ఐఎస్‌ఐ చీఫ్‌గా నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని ‘డెయిలీ పాకిస్థాన్‌’ పత్రిక వెల్లడించింది.  ఇప్పటికే ఇమ్రాన్‌ ఖాన్‌.. ఐఎస్‌ఐ చీఫ్‌గా ఎంపిక చేయడానికి తయారు చేసిన జాబితాలోని వారితో భేటీకావాలని అడిగారు. కానీ, ఐఎస్‌ఐ ప్యానల్‌లోని డీజీ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం లెఫ్టినెంట్‌ జనరల్‌ నదీం ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ నియామకం ఖాయమనే ప్రచారం జోరందుకుంది.

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మాత్రం ప్రస్తుత ఐఎస్‌ఐ చీఫ్‌ ఫయాజ్‌ హమీద్‌నే కొనసాగించాలని భావిస్తున్నారు. అఫ్గానిస్థాన్‌లో పర్యటించి వచ్చిన ఫయాజ్‌ హమీద్‌ను హఠాత్తుగా పెషావర్‌ కోర్‌(12వ కోర్‌)కు బదిలీ చేస్తూ ఆర్మీ చీఫ్‌ కమర్‌ బజ్వా ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. హమీద్‌ స్థానంలో లెఫ్టినెంట్‌ జనరల్‌ నదీమ్‌ అహ్మద్‌ అంజుమ్‌ను నియమించారు. కానీ, రోజులు గడుస్తున్నా.. కమర్‌ బజ్వా ఉత్తర్వులపై  ప్రధాని కార్యాలయం నుంచి నోటిఫికేషన్‌ జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో పలు మార్లు చర్చలు జరిగాయి. చివరికి సైన్యం ఒత్తిడికి ఇమ్రాన్‌ తలొగ్గినట్లు సమాచారం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని