గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేయండి
close

తాజా వార్తలు

Published : 16/05/2021 00:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేయండి

న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌వేవ్‌ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో గ్రామీణ భారతంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆరోగ్య సౌకర్యాలు మరింత మెరుగుపరచాలని ప్రధాని నరేంద్రమోదీ అధికారులను ఆదేశించారు. అవసరమైతే గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేయాలని, కేసులు అధికంగా ఉన్న  ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ వ్యూహాలను అమలు చేయాలని సూచించారు. రాష్ట్రాల ఉన్నతాధికారులతో శనివారం ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాల్లో నమోదువుతున్న కరోనా కేసులు, మరణాల విషయంలో పారదర్శకంగా ఉండాలన్నారు.

అదే విధంగా గ్రామాల్లోని కరోనా బాధితులకు తగినంత ఆక్సిజన్‌ అందేలా చర్యలు తీసుకోవాలని, వీలైతే ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ను ఉపయోగించాలని ప్రధాని సూచించారు. వీటి వినియోగించే విషయంలో హెల్త్‌వర్కర్లకు తగిన శిక్షణ ఇవ్వాలని తెలిపింది. గతేడాది కరోనా ఫస్ట్‌వేవ్‌లో గ్రామాల్లో చాలా తక్కువ కేసులు నమోదయ్యాయి. అయితే, ప్రస్తుతం గ్రామాల్లో ఉన్నవారే ఎక్కువ కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆశా కార్యకర్తలతో పాటు, అంగన్వాడీ కార్యకర్తలకు తగిన అవసరమైన కిట్లు అందించాలని మోదీ అన్నారు. అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ఆర్టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ టెస్టులు మరింత పెంచాలని సూచించారు.

ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితిని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపంలో అధికారులు మోదీకి వివరించారు. గత కొన్ని రోజులుగా పాజిటివిటీ రేటు నెమ్మదిగా తగ్గుతూ వస్తోందని, అదే సమయంలో రికవరీ రేటు బాగుందని తెలిపారు. రాష్ట్రాల వారీగా కరోనా పరీక్షలు, ఆక్సిజన్‌ వివరాలు, మౌలిక సదుపాయాలు, వ్యాక్సిన్‌ రోడ్‌ మ్యాప్‌ను మోదీకి అధికారులు వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని