ఈ-రిక్షాలు పంపిణీ చేసిన సోనూసూద్‌

తాజా వార్తలు

Published : 13/02/2021 10:00 IST

ఈ-రిక్షాలు పంపిణీ చేసిన సోనూసూద్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమాల్లో విలన్‌గా ఎంతగానో పేరు తెచ్చుకున్న నటుడు సోనూసూద్‌.. లాక్‌డౌన్‌లో హీరోగా మారిపోయారు. వలస కూలీలకు సాయం చేస్తూ అందరి ప్రశంసలు పొందారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేశాక షూటింగ్‌లో పాల్గొంటున్న సోనూసూద్‌ ఇప్పటికీ తన సేవలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా తన స్వస్థలం పంజాబ్‌లోని మోగా పట్టణంలో ఎనిమిది మంది నిరుద్యోగులకు ఈ-రిక్షాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆయన సోదరి మాళవిక సచార్, బావ గౌతమ్‌ సచార్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన సోనూ పలు విషయాలు పంచుకున్నారు. ‘‘దేశవ్యాప్తంగా 150 ఈ-రిక్షాలు పంచాలని నిర్ణయించుకున్నా. దీంతో కొంతమందికి ఉపాధి దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ అవసరమైన వారికి తోచినంత సాయం చేయండి. నేను నా తల్లిదండ్రుల నుంచి ఈ సేవా గుణాన్ని అలవర్చుకున్నా. నేను దేవుణ్ని కాదు.. అందరిలాగే అవసరమైన వారికి సాయం చేస్తూ నా బాధ్యత నిర్వర్తిస్తున్నా’’ అని సోనూసూద్‌ అన్నారు.

ఇవీ చదవండి...

బ్రిటన్‌పై చైనా ప్రతీకారం

ఏడు స్క్రీన్‌లతో ల్యాప్‌టాప్.. చూశారా?


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని