Lakhimpur case: లఖింపుర్‌ ఖేరిలో హింసపై రేపు సుప్రీంకోర్టు విచారణ

తాజా వార్తలు

Updated : 06/10/2021 22:11 IST

Lakhimpur case: లఖింపుర్‌ ఖేరిలో హింసపై రేపు సుప్రీంకోర్టు విచారణ

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారణ చేపట్టనుంది. ఈ కేసును యూపీ పోలీసులు దర్యాప్తు చేపట్టడంపై నిరసనలు వ్యక్తమవుతుండడంతో సుప్రీంకోర్టు ఈ కేసును విచారించాలని నిర్ణయించింది. మరోవైపు, ఈ కేసులో జోక్యం చేసుకొని సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ నిన్న యూపీకి చెందిన ఇద్దరు న్యాయవాదులు శివకుమార్‌ త్రిపాఠి, సీఎస్‌ పాండా సీజేఐకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఘటనకు బాధ్యులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని విజ్ఞప్తి చేయడంతో పాటు నిందితులకు శిక్షపడేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరారు. న్యాయవాదుల లేఖను పరిణనలోకి తీసుకున్న  సర్వోన్నత న్యాయస్థానం.. సుమోటోగా విచారణకు స్వీకరించింది. 

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆదివారం లఖింపుర్‌ ఖేరిలో రైతులు తికోనియా-బన్బీపుర్‌ రహదారిపై అన్నదాతలు ఆందోళన చేస్తుండగా.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్ర తనయుడు ఆశిష్‌ మిశ్ర కారు, మరో వాహనం వారిపైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో నలుగురు రైతులు అక్కడికక్కడే మరణించగా.. అనంతరం రైతుల దాడిలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి తనయుడు సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. యూపీ ప్రభుత్వం ఈ ఘటనపై సిట్‌ను ఏర్పాటు చేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని