WHO: కరోనా ముగిసిపోయిందని నటిస్తున్నారు..!

తాజా వార్తలు

Published : 06/10/2021 12:19 IST

WHO: కరోనా ముగిసిపోయిందని నటిస్తున్నారు..!

తప్పుడు సమాచారం ప్రజల్ని చంపేస్తోందన్న ఆరోగ్య సంస్థ

జెనీవా: కరోనా మహమ్మారి ముగిసిపోయిందని కొందరు భావిస్తున్నారని, కానీ దాన్నుంచి ఇంకా బయటపడలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. గత వారం 31 లక్షల మందికి కరోనా సోకిందని, 54 వేల మరణాల సంభవించాయని వెల్లడించింది. వాస్తవంగా ఆ లెక్కలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

‘కరోనా ముప్పు ఇంకా పొంచి ఉంది. మనకు వైరస్‌పై నియంత్రణ రాలేదు కాబట్టే.. ఈ ముప్పు కొనసాగుతోంది. మహమ్మారికి చరమగీతం పాడేందుకు మనవద్ద ఉన్న సాధనాలను సరిగా వినియోగించుకోవడంలేదు. కొన్ని ప్రాంతాల్లో ఐసీయూలు, ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ప్రజలు చనిపోతున్నారు. కానీ కొందరు మాత్రం కరోనా ముగిసిపోయిందని నటిస్తూ, తిరిగేస్తున్నారు’ అని ఆరోగ్య సంస్థకు చెందిన మారియా వ్యాన్ కెర్కోవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

దాదాపు రెండేళ్ల కాలంలో సుమారు 50 లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు. కరోనా టీకా తీసుకోని వ్యక్తుల్లోనే మరణాలు సంభవిస్తున్నాయని మారియా వెల్లడించారు. ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి, మరణాల రేటు.. టీకా తీసుకోని వారిలోనే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. కరోనా వైరస్, టీకా గురించి నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న తప్పుడు సమాచారం తీవ్ర ప్రభావం చూపుతోందని అసహనం వ్యక్తం చేశారు. అది ప్రజల మరణాలకు కారణమవుతోందని వాపోయారు. అలాగే అంతర్జాతీయ సమాజం వైరస్‌పై వీలైనంత ఎదురుదాడి చేయలేదని గుర్తు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని