దిగొచ్చిన ట్విటర్..!

తాజా వార్తలు

Published : 12/02/2021 17:38 IST

దిగొచ్చిన ట్విటర్..!

 కేంద్రం సూచించిన 97 శాతం ఖాతాలు, పోస్టులపై చర్యలు

దిల్లీ: రైతు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్న ఖాతాలను కట్టడి చేయాలన్న కేంద్రం ఆదేశాలను ట్విటర్ పాటించినట్లు తెలుస్తోంది. వాటిలో 97 శాతం ఖాతాలు, పోస్టులను బ్లాక్‌ చేసినట్లు సంబంధిత వర్గాల సమాచారం.
రైతుల ఉద్యమానికి సంబంధించి కేంద్రం ప్రభుత్వం, ట్విటర్‌కు మధ్య విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం రోజున  కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ట్విటర్ ప్రతినిధుల మధ్య సమావేశం జరిగింది. స్థానిక చట్టాలను పాటించాలని లేకపోతే కఠిన చర్యలకు సిద్ధంగా ఉండాలని సంస్థ ప్రతినిధులకు కేంద్రం గట్టి హెచ్చరికలు పంపింది. అంతేకాకుండా భారత చట్టాలను పాటించాల్సిందేనని గురువారం ఐటీ శాఖ మంత్రి పార్లమెంట్‌ వేదికగా స్పష్టం చేశారు. తాజాగా ట్విటర్ కేంద్రం ఆదేశాలను పాటించిందని, 97 శాతం ఖాతాలను, పోస్టులను బ్లాక్‌ చేసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ వార్తలపై ట్విటర్ స్పందించలేదు. 

రైతుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించేలా ట్వీట్లు చేసిన 1,178 ఖాతాలపై చర్యలు తీసుకోవాలని కొద్ది రోజులు క్రితం కేంద్రం ఆదేశాలు జారీచేసింది. భావ ప్రకటన స్వేచ్ఛకు తాము ప్రాధాన్యం ఇస్తామంటూ ట్విటర్ వాటిలో కొన్నింటిపైనే చర్య తీసుకుంది. ఆ వ్యవహారంలో కేంద్రం తీవ్ర ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి:

కేంద్రం, ట్విటర్‌కు సుప్రీం నోటీసులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని