Viral: కొవిడ్‌ రోగి ముఖం వాచిపోయేలా కుట్టిన చీమలు

తాజా వార్తలు

Published : 31/07/2021 13:41 IST

Viral: కొవిడ్‌ రోగి ముఖం వాచిపోయేలా కుట్టిన చీమలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుజరాత్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వడోదరలోని సర్ సాయాజీరావు ఆస్పత్రి ఐసీయూలో ఓ కొవిడ్ బాధితురాలు చికిత్స పొందుతుండగా ఆమె ముఖంపై వందలాదిగా చీమలు దర్శనమిచ్చాయి. చీమలు విపరీతంగా కుట్టడంతో ఆమె ముఖమంతా వాచి పోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను బాధితురాలి భర్త సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయటంతో అది విపరీతంగా వైరల్ అయింది. కాగా రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్  చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆస్పత్రి సూపరెంటెండెంట్‌ రంజన్ అయ్యర్ తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని