కిలోమీటరు వెంబడించి.. ఐటీ అధికారిని పట్టుకున్న సీబీఐ

ప్రధానాంశాలు

Updated : 10/04/2021 09:20 IST

కిలోమీటరు వెంబడించి.. ఐటీ అధికారిని పట్టుకున్న సీబీఐ

ముంబయిలో సినిమా ఫక్కీ ఘటన

దిల్లీ: రాత్రి 10 గంటలు.. ముంబయిలోని గోరెగావ్‌ తూర్పు ప్రాంతం.. రూ. 5 లక్షల లంచం సొమ్మును రోడ్డుపై పడేసి ఓ ఐటీ అధికారి పరుగెడుతుండగా, సినిమా ఫక్కీలో అతన్ని మరో సీబీఐ అధికారి వెంబడించారు. కిలో మీటరుకు పైగా పరుగెత్తి పట్టుకున్నారు. లంచం తీసుకోవడానికి వచ్చిన ఆదాయపు పన్ను(ఐటీ) ఇన్‌స్పెక్టర్‌ ఆశిష్‌ కుమార్‌ ఎట్టకేలకు సీబీఐకి చిక్కారు. సీబీఐ అధికారుల సమాచారం ప్రకారం.. ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడిన ఓ వ్యక్తిని దీన్నుంచి బయటపడేస్తామంటూ బల్లార్డ్‌ పీర్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఆశిష్‌తో పాటు మరో ఇద్దరు ఐటీ అధికారులు ఆ వ్యక్తిని వేర్వేరుగా లంచం డిమాండ్‌ చేశారు. అతని ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు వలపన్నారు. ఆ వ్యక్తి రూ. 5 లక్షలు ఆశిష్‌ కుమార్‌కు రాత్రివేళ అందజేయగా అతను ఆ మొత్తాన్ని ఓ బ్యాగులో ఉంచారు. అంతలో సీబీఐ అధికారులు చుట్టుముట్టడంతో ఆశిష్‌ డబ్బున్న బ్యాగును రోడ్డుపైకి విసిరేసి పరుగెత్తడం మొదలు పెట్టారు. దీంతో సీబీఐ అధికారి వినీత్‌ జైన్‌ ఆయన్ను వెంబడించి పట్టుకుని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో రూ. 10 లక్షలు డిమాండ్‌ చేసిన మరో ఐటీ ఇన్‌స్పెక్టర్‌ దిలీప్‌ కుమార్‌ను కూడా అరెస్టు చేశారు. మూడో ఐటీ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాయ్‌పై కేసు నమోదు చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన