కరోనా మృతదేహాన్ని నదిలోకి విసిరేశారు

ప్రధానాంశాలు

Published : 31/05/2021 04:57 IST

కరోనా మృతదేహాన్ని నదిలోకి విసిరేశారు

బలరాంపుర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలరాంపుర్‌ జిల్లాలో రాప్తీ నది వంతెన మీదుగా కరోనా వైరస్‌ బాధితుడి మృతదేహాన్ని నదిలోకి విసురుతూ ఇద్దరు వ్యక్తులు వీడియోకు చిక్కారు. ఆ సమయంలో అటుగా వాహనంలో వెళుతున్న వ్యక్తులు వీడియో తీసి పోలీసులకు చేరవేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇద్దరినీ అరెస్టు చేశారు. ఆదివారం జరిగిన ఈ సంఘటన గురించి ఏఎస్పీ అర్వింద్‌ మిశ్రా మీడియాకు తెలుపుతూ.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కొవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించేందుకు సంబంధిత కుటుంబానికి అందజేసినట్టు చెప్పారు. నిందితుల్లో పీపీఈ కిట్‌ వేసుకున్న వ్యక్తిని మనోజ్‌గా గుర్తించారు. రెండో వ్యక్తి మృతునికి సమీప బంధువు. మృతుడు సిద్దార్థ్‌నగర్‌ జిల్లా షొహ్రత్‌గఢ్‌కు చెందిన ప్రేమ్‌నాథ్‌ మిశ్రాగా గుర్తించినట్టు బలరాంపుర్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ విజయ్‌ బహదూర్‌సింగ్‌ తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన