ఆ చట్టాన్ని అనాలోచితంగా వాడతారా?
close

ప్రధానాంశాలు

Published : 16/06/2021 05:03 IST

ఆ చట్టాన్ని అనాలోచితంగా వాడతారా?

యూఏపీఏ ప్రయోగంపై దిల్లీ హైకోర్టు ఆక్షేపణ
జేఎన్‌యూ, జేఎంఐ విద్యార్థులకు బెయిల్‌ మంజూరు

దిల్లీ: నిరసన గళాన్ని అణగదొక్కాలనే ఆత్రుతతో.. ఉగ్రవాద చర్యలకు, రాజ్యాంగబద్ధమైన నిరసన హక్కుకు మధ్య ఉన్న రేఖను ప్రభుత్వం మరుగున పడేస్తోందని దిల్లీ హైకోర్టు ఆక్షేపణ వ్యక్తంచేసింది. ఇదే ధోరణి కొనసాగితే ప్రజాస్వామ్యానికి విషాదమని వ్యాఖ్యానించింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈశాన్య దిల్లీలో చోటు చేసుకున్న అల్లర్ల ఘటనలకు సంబంధించి దిల్లీలోని జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) విశ్వవిద్యాలయాలకు చెందిన ముగ్గురు విద్యార్థులకు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్‌ సిద్ధార్థ్‌ మృదుల్‌, జస్టిస్‌ అనూప్‌ జైరాం భంభానీల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

నిర్వచనం అస్పష్టంగా ఉంది
కఠినమైన ‘చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం’ (యూఏపీఏ)లోని సెక్షన్‌ 15లో ‘ఉగ్రవాద చర్య’కు నిర్వచనం అస్పష్టంగా ఉందని, అలాంటిదానిని యథాలాపంగా వినియోగించకూడదని ధర్మాసనం హెచ్చరించింది. విద్యార్థులకు బెయిల్‌ ఇవ్వకూడదన్న దిగువ న్యాయస్థానం తీర్పును తోసిపుచ్చింది. దేశ పునాదులు బలమైనవనీ, విద్యార్థులో, మరొకరో వ్యక్తం చేసే నిరసనలతో అవి కదిలిపోయే అవకాశం లేదని స్పష్టంచేసింది. ఆయుధాలు లేకుండా శాంతియుతంగా నిరసనలు తెలియజేసేందుకు హక్కు ఉందని తేల్చిచెప్పింది. దానిని ఉగ్రవాద చర్యగా చెప్పలేమంది. ఐపీసీ పరిధిలోకి వచ్చే నేరాలనూ యూఏపీఏ కిందికి చేర్చడం తగదని పేర్కొంది. విద్యార్థుల విషయంలో ఉగ్రవాద చర్య ఏమీ కనిపించడం లేదంది. ముగ్గురు విద్యార్థులూ తమ పాస్‌పోర్టులను అప్పగించాలని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయకూడదని ఆదేశించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన