మా హక్కులను కాలరాయొద్దు

ప్రధానాంశాలు

Published : 04/09/2021 05:24 IST

మా హక్కులను కాలరాయొద్దు

కాబుల్‌లో మహిళల నిరసన ప్రదర్శన

కాబుల్‌: హక్కుల పరిరక్షణ కోసం అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో పదుల సంఖ్యలో మహిళలు శుక్రవారం కదం తొక్కారు. దేశాధ్యక్ష భవనం ముందు గుమిగూడి నిరసన ప్రదర్శన నిర్వహించారు. గత 20 ఏళ్లుగా తాము అనుభవిస్తున్న హక్కులను కాలరాయొద్దని, కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వంలో స్త్రీలకూ చోటు కల్పించాలని తాలిబన్లను డిమాండ్‌ చేశారు. ‘‘మహిళల భాగస్వామ్యంతో వీరోచిత కేబినెట్‌’’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. మానవ హక్కులను పరిరక్షించాలని నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా మహిళలందరికీ విద్య, సామాజిక, రాజకీయ రంగాల్లో పూర్తిస్థాయిలో హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన