అదే మోదీకి జన్మదిన కానుక..

ప్రధానాంశాలు

Published : 17/09/2021 04:26 IST

అదే మోదీకి జన్మదిన కానుక..

భారీఎత్తున వ్యాక్సినేషన్‌కు కేంద్ర మంత్రి పిలుపు

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా భారీఎత్తున కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేపట్టాలని కార్యకర్తలకు భాజపా పిలుపునిచ్చింది. అర్హులైన ప్రజలంతా టీకాలు వేసుకునేలా కృషి చేయాలని.. అదే ప్రధాని మోదీకి తగిన జన్మదిన కానుక అవుతుందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పేర్కొన్నారు. శుక్రవారం నుంచి 20 రోజుల పాటు ప్రజల్లోకి వెళ్లేందుకు భాజపా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. ఈ సందర్భంగా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటి నుంచి ప్రధాని మోదీ 20 ఏళ్ల ప్రజా జీవితంపై ప్రజలకు వివరించనుంది. 2014లో మోదీ ప్రధాని పగ్గాలు చేపట్టినప్పటి నుంచి భాజపా ఆయన జన్మదినాన్ని ‘సేవా దివస్‌’గా నిర్వహిస్తోంది. వైద్య, రక్తదాన శిబిరాలు.. పేదలకు రేషన్‌ పంపిణీ వంటి కార్యక్రమాలను చేపట్టాలంటూ భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా కార్యకర్తలను సమాయత్తం చేశారు. ఈ మేరకు మోదీ ఫొటోలతో ఉన్న 14 కోట్ల సంచుల్లో నిత్యావసరాలను పంపిణీ చేస్తారు. అక్టోబరు 2న భాజపా కార్యకర్తలు పెద్దఎత్తున స్వచ్ఛత కార్యక్రమాలు చేపడతారు. తాము ప్రజా జీవితానికి కట్టుబడి పనిచేస్తున్నట్లు పేర్కొంటూ భాజపా బూత్‌ కార్యకర్తలు 5 కోట్ల పోస్టు కార్డులు కూడా ప్రధానికి పంపుతారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన