అణ్వస్త్ర వ్యాప్తిపై కన్నేయండి

ప్రధానాంశాలు

Published : 28/09/2021 04:41 IST

అణ్వస్త్ర వ్యాప్తిపై కన్నేయండి

అంతర్జాతీయ సమాజానికి భారత్‌ విజ్ఞప్తి

ఐరాస: అణ్వాయుధాలు, వాటిని ప్రయోగించేందుకు వాడే వ్యవస్థలు, విడిభాగాలు, సంబంధిత ఇతర పరిజ్ఞానాలకు సంబంధించిన నెట్‌వర్క్‌ల అక్రమవ్యాప్తిపై అంతర్జాతీయ సమాజం నిశిత దృష్టి పెట్టాలని భారత్‌ సోమవారం కోరింది. చైనా, పాకిస్థాన్‌ల మధ్య సాగుతున్న అణు వాణిజ్యాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం (సీటీబీటీ)పై సోమవారం ఐరాస భద్రతా మండలిలో జరిగిన ఒక సమావేశంలో భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా మాట్లాడారు. అంతర్జాతీయ అణు భద్రతా యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి భారత్‌ ఇతోధిక తోడ్పాటు అందించిందని చెప్పారు. అణ్వస్త్ర రహిత ప్రపంచానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. 2006లో ఐరాస సర్వప్రతినిధి సభకు తాము ఒక కార్యాచరణ పత్రాన్ని సమర్పించామని చెప్పారు. అందులో పేర్కొన్న విధంగా.. అణ్వస్త్ర రహిత ప్రపంచ సాధనకు అంచలంచెలుగా చర్యలు చేపట్టాలని సూచించారు. అణుపరీక్షలపై భారత్‌ స్వచ్ఛందంగా మారటోరియం విధించుకుందని ఆయన గుర్తుచేశారు. అంతర్జాతీయ నిబంధనలకు తూట్లు పొడుస్తూ.. చైనా నుంచి పాకిస్థాన్‌కు అణు పదార్థాల ఎగుమతులు సాగడంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో శ్రింగ్లా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన