వయసు ఏడాది.. ఆదాయం రూ.75 వేలు

ప్రధానాంశాలు

Published : 22/10/2021 07:40 IST

వయసు ఏడాది.. ఆదాయం రూ.75 వేలు

వాషింగ్టన్‌: ఏడాది వయసున్న చిన్నారి ఓ వింత కొలువుతో నెలకు రూ. 75 వేలు సంపాదిస్తున్నాడు. పలు ప్రాంతాల్లో పర్యటించడమే ఆ చిన్నారి చేస్తున్న పని. అమెరికాకు చెందిన బేబీ బ్రిగ్స్‌ ఇప్పటికే 45 సార్లు విమాన ప్రయాణం చేశాడు. ఆ దేశంలోని 16 రాష్ట్రాలను చుట్టొచ్చాడు. అలస్కా, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, ఉతాల్లోని పార్కులు, బీచ్‌ల్లోనూ తిరిగాడు. అసలు దీనికి డబ్బులెలా ఇస్తారని ఆలోచిస్తున్నారా? చిన్నారితో వివిధ ప్రాంతాలు చుట్టి.. ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం బ్రిగ్స్‌ తల్లి జెస్‌ పని. దీనికి డబ్బులు కూడా చెల్లిస్తారు. ఇలా సగటున నెలకు రూ.75 వేలకుపైనే ఆదాయం వస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రిగ్స్‌కు 30 వేల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన