ఇది సినిమా కథ కాదు
close

ప్రధానాంశాలు

Published : 19/06/2021 02:58 IST

ఇది సినిమా కథ కాదు

మురుగు నీరు ప్రవహిస్తున్న ఓపెన్‌ నాలా పక్కనే ఓ చిన్న ఇల్లు.. పది అడుగులు వేసేంత స్థలం కూడా లేని అందులో అయిదుగురి నివాసం. రోజూ తాగి వచ్చి గొడవ చేసే తండ్రి.. భయపడి కళ్లు, చెవులు మూసుకుని తల్లి వెనకాల దాక్కునే ముగ్గురు ఆడపిల్లలు.. కుటుంబ పోషణ కోసం ఇతరుల ఇళ్లలో, కర్మాగారంలో పని చేసే ఆ తల్లి.. ఆమెకు సాయంగా వెళ్లే ముగ్గురు పిల్లలు. కట్‌ చేస్తే.. ఇప్పుడా ముగ్గురిలో చిన్నమ్మాయి ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో దేశం తరపున ప్రాతినిథ్యం వహించబోతుంది.. ఇదేదో సినిమా కథలా ఉందనిపిస్తోంది కదా! కానీ ఇది నిజ జీవిత కథ. చిన్నప్పటి నుంచే కష్టాలతో సావాసం చేసిన ఓ అమ్మాయి సాగించిన అద్భుత ప్రయాణమిది. ఆమే.. స్నేహ గోయల్‌. వచ్చే నెలలో ఆరంభమయ్యే టోక్యో ఒలింపిక్స్‌లో బరిలో దిగే మహిళల హాకీ జట్టులో చోటు దక్కించుకున్న ఈ 24 ఏళ్ల వీర వనిత స్ఫూర్తి గాథ ఇది.
హరియాణాలోని సోనెపట్‌కు చెందిన స్నేహ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంది. చిన్నప్పటి నుంచే కష్టాలు వెంబడించినా.. చిరునవ్వుతో ముందుకు సాగుతూ.. ఆత్మవిశ్వాసంతో, మనోస్థైర్యంతో గమ్యాన్ని చేరుకునే దిశగా కదులుతోంది. చీకటిలోకి తోయాలని చూసిన కఠిన పరిస్థితులను దాటి.. తన జీవితంలో వెలుగు నింపుకొంది. కటిక పేదరికంలో ఉన్నా.. మూడు పూటల తినడమే గగనమైనా.. ఆటనే నమ్ముకున్న ఆమె.. అద్భుత నైపుణ్యాలతో అంచెలంచెలుగా ఎదిగింది. ఒక్కసారైనా ఒలింపిక్స్‌లో పోటీపడాలని ప్రతి ఒక్క అథ్లెట్‌ కనే కలను నిజం చేసుకోబోతోంది. బాల్యం నుంచి తోడుగా నిలిచిన అమ్మ సావిత్రి దేవి అండతో.. అన్నీతానై ప్రోత్సహించిన కోచ్‌ ప్రీతమ్‌ సివాచ్‌ చలవతో ఇంత దూరం రాగలిగింది. తండ్రి తాగి ఇంటికి వచ్చి నానా వీరంగం సృష్టించడం.. కుటుంబ బాధ్యతను భుజాలకెత్తుకున్న తల్లి పనికి వెళ్లడం.. ఇవే బాల్యంలో స్నేహకు కనిపించిన దృశ్యాలు. అమ్మకు సాయంగా ఉండడం కోసం తన ఇద్దరక్కలతో కలిసి నెలకు రూ.2 వేల కోసం ఆమె కూడా సైకిల్‌ చక్రాల ఊచల తయారీ కర్మాగారానికి పనికి వెళ్లింది. కానీ ఆటల మీద ఇష్టం ఉండే ఆమె ప్రతి రోజూ మైదానం బయట తచ్చాడుతూ ఉండేది.
అదే మలుపు..
హాకీ అకాడమీ నడిపే మాజీ క్రీడాకారిణి, కోచ్‌ ప్రీతమ్‌ సివాచ్‌ కళ్లలో పడడంతో స్నేహ జీవితం గొప్ప మలుపు తిరిగింది. ఓ సారి స్నేహకు తాడు ఇచ్చి స్కిప్పింగ్‌ చేయమని ప్రీతమ్‌ చెప్పింది. తన సామర్థ్యానికి ఆశ్చర్యపోయిన ప్రీతమ్‌.. హాకీ ఆడితే రోజుకు రెండు పూటలా భోజనం పెడతానని చెప్పింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించేందుకు వాళ్ల ఇంటికి కూడా వెళ్లింది. కూతురు ఇంట్లో కంటే హాకీ మైదానంలోనే సురక్షితంగా ఉంటుందని భావించిన స్నేహ తల్లి 11 ఏళ్ల వయసులో తనను అకాడమీలో చేర్పించింది. అప్పటి నుంచి స్నేహ పూర్తి బాధ్యత కోచ్‌ తీసుకుంది. ఓ రాష్ట్ర స్థాయి మ్యాచ్‌లో ఆడుతున్నపుడు స్నేహ బూట్లకు రంధ్రం పడడంతో ఆమె వేగంగా పరుగెత్తలేకపోయింది. వెంటనే ప్రీతమ్‌ భర్త.. దగ్గర్లో ఉన్న దుకాణానికి వెళ్లి కొత్త బూట్లు కొనుక్కొచ్చి ఇచ్చాడు. ఇలా ఆమె ప్రతి అవసరాన్నీ తీర్చిన ప్రీతమ్‌.. తనను అద్భుతమైన క్రీడాకారిణిగా తీర్చిదిద్దింది. కొన్నేళ్ల తర్వాత స్నేహ తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత కూడా ఓ వైపు హాకీ ఆడుతూనే.. మరోవైపు తల్లికి సాయంగా పనిచేసేది. చిరుత వేగం, గోల్స్‌ చేయడంలో కచ్చితత్వంతో ఎదిగిన ఆమె 18 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ హాకీలో అరంగేట్రం చేసింది. జాతీయ కోచ్‌ మారిజ్నె శిక్షణలో చురుకైన అటాకర్‌గా మారి.. ప్రత్యర్థి డిఫెన్స్‌ ఛేదించడంలో పట్టు సాధించింది. రైల్వేలో ఉద్యోగం సాధించిన ఈ 4.9 అడుగుల క్రీడాకారిణి.. తక్కువగా ఉండే తన ఎత్తును అనుకూలంగా మార్చుకుని ప్రత్యర్థులకు చిక్కకుండా పరుగులు తీస్తూ ఆటలో ప్రత్యేకతను చాటుకుంటోంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ చిరునవ్వును వదలని స్నేహ.. తన సంపాదనతో జూనియర్‌ క్రీడాకారిణులకు సాయం చేస్తుండటం విశేషం. అలాగే తన ఎదుగుదలకు కారణమైన అకాడమీకి కూడా అండగా నిలుస్తోంది. ఇటీవలే ఓ భారీ అపార్ట్‌మెంట్లో ఇల్లు తీసుకున్న ఆమె తన తల్లితో కలిసి అందులో ఉంటోంది. అంతే కాకుండా ఆ ఇంట్లో ఓ రెండు గదులను ఖాళీగా ఉంచి.. ప్రీతమ్‌ అకాడమీలో శిక్షణ పొందుతూ వసతి సౌకర్యం లేని క్రీడాకారిణులకు అందులో ఆశ్రయం కల్పిస్తోంది. 2018 ఆసియా క్రీడల్లో రజతం గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన స్నేహ.. టోక్యో ఒలింపిక్స్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేసే దిశగా సన్నద్ధమవుతోంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన