మెక్‌లాలిన్‌ ప్రపంచ రికార్డు

ప్రధానాంశాలు

Published : 05/08/2021 02:48 IST

మెక్‌లాలిన్‌ ప్రపంచ రికార్డు

400 మీ హర్డిల్స్‌లో పసిడి సొంతం

టోక్యో: మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌.. 200 మీటర్ల వరకు ఆమె ముందంజలోనే లేదు.. పైగా సమీప ప్రత్యర్థి జోరున దూసుకెళ్తోంది. అప్పటివరకు ఒకరి వెనకే ఉన్న ఆమె.. అసాధారణంగా పుంజుకుంది. ప్రత్యర్థిని దాటేయడమే కాక.. ఏకంగా ప్రపంచ రికార్డు బద్దలుకొట్టింది. ఆమే అమెరికా అమ్మాయి సిడ్నీ మెక్‌లాలిన్‌! టోక్యోలో అదరగొట్టిన ఈ టీనేజర్‌ 400 మీటర్ల హర్డిల్స్‌లో ప్రపంచ రికార్డు సృష్టిస్తూ పసిడి పతకాన్ని గెలుచుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో సిడ్నీ 51.46 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని తన పేరిటే ఉన్న రికార్డు (51.90 సె)ను మెరుగుపరిచింది. ఈ రేసులో మరో అమెరికా తార మహ్మద్‌ దలీలా (51.58 సెకన్లు) రజతం గెలుచుకుంది. తొలి 200 మీటర్ల వరకు దలీలానే ఆధిపత్యం ప్రదర్శించినా.. మధ్యలో పుంజుకున్న మెక్‌లాలిన్‌ ఆమెను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్‌ అమ్మాయి ఫెంకె (52.03 సె) కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఈ జూన్‌లో దలీలా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలుకొట్టిన మెక్‌లాలిన్‌.. టోక్యోలో పసిడి గెలవడమే లక్ష్యంగా బరిలో దిగింది. మెక్‌లాలిన్‌కు ఇదే తొలి ఒలింపిక్‌ పతకం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన