థాయ్‌లాండ్‌ చేతిలో భారత్‌ ఓటమి

ప్రధానాంశాలు

Published : 27/09/2021 01:04 IST

థాయ్‌లాండ్‌ చేతిలో భారత్‌ ఓటమి

వాంటా (ఫిన్లాండ్‌): సుదిర్మన్‌ కప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ గ్రూప్‌-ఎ తొలి పోరులో భారత్‌ 1-4తో థాయ్‌లాండ్‌ చేతిలో పరాజయం చవిచూసింది. పురుషుల సింగిల్స్‌లో మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ కిదాంబి శ్రీకాంత్‌ 9-21, 19-21తో విదిత్‌ చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప 21-23, 8-21తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకు జోడీ జాంగ్‌కోల్‌పాన్‌-రవీందా చేతిలో పరాజయం చవిచూశారు. మహిళల సింగిల్స్‌లో మల్విక 11-21, 14-21తో చోచూవాంగ్‌ చేతిలో ఓడడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. నామమాత్రమైన పురుషుల డబుల్స్‌లో అర్జున్‌-ధ్రువ్‌ కపిల 21-18, 21-17తో సపక్‌-కిటిన్‌పాంగ్‌పై గెలిచినా.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాయిప్రణీత్‌-తనీషా జోడీ 13-21, 11-21తో డెచ్‌పోల్‌-సాప్‌సిరీ చేతిలో పరాజయం చవిచూసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన