సూపర్‌-12కు బంగ్లా, స్కాట్లాండ్‌

ప్రధానాంశాలు

Published : 22/10/2021 03:00 IST

సూపర్‌-12కు బంగ్లా, స్కాట్లాండ్‌

అల్‌ మెరాట్‌: టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌ సూపర్‌-12కు దూసుకెళ్లాయి. పపువా న్యూగినియాపై బంగ్లా.. ఒమన్‌పై స్కాట్లాండ్‌ నెగ్గాయి. దీంతో గ్రూప్‌-బిలో అగ్రస్థానంతో స్కాట్లాండ్‌ (3 మ్యాచ్‌ల్లో 6 పాయింట్లు), రెండో స్థానంతో బంగ్లా (3 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు) ముందంజ వేశాయి. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో షకిబ్‌ అల్‌ హసన్‌ (46; 37 బంతుల్లో 3×6; 4/9) ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేయడంతో బంగ్లా 84 పరుగుల భారీ తేడాతో పపువా న్యూగినియాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాకు న్యూగినియా కనీస పోటీ ఇవ్వలేకపోయింది. మొదట బంగ్లా 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసింది. కెప్టెన్‌ మహ్మదుల్లా (50; 28 బంతుల్లో 3×4, 3×6), షకిబ్‌ రాణించి జట్టుకు భారీ స్కోరు అందించారు. న్యూగినియా బౌలర్లలో మొరేయా, డామియన్‌, అసద్‌ తలా రెండు వికెట్లు తీశారు. ఛేదనలో షకిబ్‌, సైఫుద్దీన్‌ (2/21), తస్కిన్‌ అహ్మద్‌ (2/12) ధాటికి న్యూగినియా 19.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టిన షకిబ్‌.. కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రత్యర్థి పతనంలో కీలకపాత్ర పోషించాడు.

రాణించిన కొయిట్జర్‌, డేవి: మరో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఒమన్‌ను ఓడించిన స్కాట్లాండ్‌ తొలిసారి ఈ కప్‌లో ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. ఈ పోరులో మొదట ఒమన్‌ 20 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌటైంది. అకిబ్‌ (37), కెప్టెన్‌ జీషన్‌ (34), నదీమ్‌ (25) రాణించారు. జోష్‌ డేవీ (3/25), షరీఫ్‌ (2/25), లీక్‌ (2/13) ప్రత్యర్థిని కట్టడి చేశారు. కెప్టెన్‌ కైల్‌ కొయిట్జర్‌ (41) రాణించడంతో లక్ష్యాన్ని స్కాట్లాండ్‌ 17 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అందుకుంది. కైల్‌ ఔటైనా.. క్రాస్‌ (26 నాటౌట్‌), బారింగ్టన్‌ (31 నాటౌట్‌) జట్టును గెలిపించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన