వారి ఆనందం కోసం..: నబి

ప్రధానాంశాలు

Published : 25/10/2021 02:23 IST

వారి ఆనందం కోసం..: నబి

షార్జా: టీ20 ప్రపంచకప్‌లో తమ జట్టు సత్తాచాటితే సొంతగడ్డపై అభిమానుల ముఖాల్లో మళ్లీ ఆనందం చూడొచ్చని అఫ్గానిస్తాన్‌ కెప్టెన్‌ మహ్మద్‌ నబి ఆశాభావం వ్యక్తంజేశాడు. ‘‘గత కొన్ని నెలలుగా అఫ్గాన్‌లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అయితే క్రికెట్‌ పరంగా ప్రతి ఒక్కరం ప్రపంచకప్‌ కోసం సర్వసన్నద్ధంగా ఉన్నాం. అఫ్గాన్‌లో ఏకైక ఆనందం క్రికెటే. అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మేం బాగా ఆడి మ్యాచ్‌ల్లో గెలిస్తే సొంతగడ్డపై అభిమానులు ఎంతగానో సంతోషిస్తారు. వారి ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తాయి’’ అని నబి తెలిపాడు. సోమవారం స్కాట్లాండ్‌తో అఫ్గాన్‌ తలపడనుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన