అఫ్గాన్‌ జైలులోని నా కుమార్తెను తీసుకురండి

ప్రధానాంశాలు

Updated : 03/08/2021 05:44 IST

అఫ్గాన్‌ జైలులోని నా కుమార్తెను తీసుకురండి

సుప్రీంకోర్టుకు ఓ తండ్రి వినతి

అక్కడికి వెళ్లి ఐఎస్‌లో చేరిన ఆ మహిళ

దిల్లీ: అఫ్గానిస్థాన్‌ జైలులో ఉన్న తన కుమార్తె, మనుమరాలిని తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ కేరళ వాసి ఒకరు సుప్రీంకోర్టులో దావా వేశారు. అక్కడి పుల్‌-ఎ-చర్కి జైలులో ఉన్నారని, తన మనుమరాలు మైనర్‌ కూడా అని ఎర్నాకుళానికి చెందిన వి.జె.సెబాస్టియన్‌ తెలిపారు. వారిపై చట్టవ్యతిరేక కార్యకాలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద ఎన్‌ఐఏ కేసులు నమోదు చేయడం గమనార్హం. ఆ దావా ప్రకారం ఆయన అల్లుడు, కుమార్తె, మనుమరాలు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌)లో చేరడానికి 2016 జులై 30న అఫ్గానిస్థాన్‌ వెళ్లారు. కుమార్తె పేరున 2017 మార్చి 22న ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేసింది. అక్కడి జరిగిన యుద్ధంలో అల్లుడు చనిపోయాడు. కుమార్తె, మనుమరాలు 2019 నవంబరు 15న అధికారులకు లొంగిపోవడంతో వారిని అక్కడి జైలులో ఉంచారు. ఇటీవల ఆమె ఓ న్యూస్‌పోర్టల్‌తో మాట్లాడుతూ ఐఎస్‌లో చేరడం తప్పేనని పశ్చాత్తాప పడ్డారు. భారత్‌కు తిరిగి వెళ్లి కోర్టులో విచారణను ఎదుర్కోవాలని అనుకుంటున్నానని చెప్పారు. అఫ్గాన్‌లో ఐఎస్‌ అంతమయిందని, తాలిబన్లు ఆమెను ఉరితీసే ప్రమాదం ఉన్నందున ఆమెను తిరిగి తీసుకురావాలని సెబాస్టియన్‌ కోరారు. నేరగాళ్ల మార్పిడిపై అఫ్గాన్‌తో 2016లో ఒప్పందం కుదిరినందున దౌత్యమార్గాల్లో ఆమెను తీసుకువచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన