తెలిసిన వ్యక్తి బైకు ఎక్కిన వితంతువుకు శిరోముండనం

ప్రధానాంశాలు

Published : 03/08/2021 07:54 IST

తెలిసిన వ్యక్తి బైకు ఎక్కిన వితంతువుకు శిరోముండనం

గుజరాత్‌లో ఆరుగురు అరెస్టు

అహ్మదాబాద్‌: వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ.. 30 ఏళ్ల వితంతువుకు గ్రామస్థులు శిరోముండనం చేశారు. ఆమెపై దాడికి పాల్పడి దుస్తులు చింపారు. గుజరాత్‌లోని సాబర్‌కాంటా జిల్లాలోని గ్రామంలో గత నెల 30న ఈ ఘటన జరిగింది. నలుగురు పిల్లలతో కలిసి గ్రామంలో ఉంటున్న ఓ వితంతు మహిళ గత శుక్రవారం తన ఇద్దరు కుమారుల్ని తీసుకుని సమీపంలోని హిమ్మత్‌నగర్‌ పట్టణానికి వెళ్లింది. పిల్లల ఆధార్‌ కార్డు కాపీలను అక్కడి బ్యాంకులో ఇచ్చింది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం పూట ఆమెకు తెలిసిన వ్యక్తి ఒకరు బైకుపై లిఫ్టు ఇచ్చాడు. మార్గమధ్యలో నలుగురు గ్రామస్థులు బైకును ఆటకాయించారు. వారిద్దరికీ రహస్య సంబంధం ఉందంటూ తీవ్రంగా కొట్టి, తర్వాత గ్రామానికి తీసుకొచ్చారు. అక్కడ ఈ నలుగురితో పాటు మరో ఇద్దరు కలిసి దాడికి పాల్పడ్డారు. మహిళ దుస్తులు చింపి శిరోముండనం చేశారు. మరోసారి ఇద్దరూ కలిసి కనిపిస్తే చంపుతామంటూ బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదుపై నిందితులైన నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. 147, 354, 506-2 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన