పండగలొస్తున్నాయ్‌ జాగ్రత్త!

ప్రధానాంశాలు

Published : 05/08/2021 05:10 IST

పండగలొస్తున్నాయ్‌ జాగ్రత్త!

కరోనాపై కేంద్రం సూచనలు

ఈనాడు, దిల్లీ: పండగల సందర్భంగా కరోనా వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు బుధవారం లేఖలు రాశారు. ఓనం(ఆగస్టు 21), కృష్ణాష్టమి(ఆగస్టు 30), వినాయక చవితి (సెప్టెంబర్‌ 10), దుర్గాపూజ (అక్టోబర్‌ 5-15)ల సందర్భంగా జనం గుమికూడే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల స్థానికంగా ఆంక్షలు విధించాలని సూచించారు. ఒకే చోట ఎక్కువ మంది చేరితే కొవిడ్‌ కేసులు పెరుగుతాయని ఐసీఎంఆర్‌ హెచ్చరిస్తున్నట్లు గుర్తుచేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన