19 రోజులుగా చమురు ధరలు ఎందుకు పెరగలేదో: చిదంబరం

ప్రధానాంశాలు

Published : 06/08/2021 04:46 IST

19 రోజులుగా చమురు ధరలు ఎందుకు పెరగలేదో: చిదంబరం

దిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 19 రోజులుగా పెరగకపోవడాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ పి.చిదంబరం కేంద్రాన్ని ఎద్దేవా చేశారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై 18 రోజులవుతోందని, వాటికోసమే పెంచి ఉండకపోవచ్చన్నారు. లేదా చమురు సంస్థల అధినేతలు పెగాసస్‌ స్పైవేర్‌ నిఘా భయంతో ఫోన్లలో మాట్లాడుకోకపోయుండొచ్చని, అందుకే ధరలు పెంచడం సాధ్యం కాలేదని అన్నారు. లేదా వారంతా ఆగస్టు 15 వరకూ క్వారంటైన్‌లోకి వెళ్లి ఉండొచ్చని అన్నారు. పైన చెప్పిన అన్ని కారణాలతోనూ చమురు ధరలు పెంచకపోయుండొచ్చని ఎద్దేవా చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన