6 విమానాశ్రయాల్లో ముఖ పరీక్షలు

ప్రధానాంశాలు

Published : 06/08/2021 05:36 IST

6 విమానాశ్రయాల్లో ముఖ పరీక్షలు

జాబితాలో హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరు

దిల్లీ: దేశంలోని ఆరు విమానాశ్రయాల్లో ముఖ పరీక్షల సాంకేతికత (ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ) ద్వారా బయోమెట్రిక్‌ బోర్డింగ్‌ విధానాన్ని (బీబీఎస్‌) ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ జాబితాలో బెంగళూరు, హైదరాబాద్‌, పుణె, కోల్‌కత, వారణాసి, విజయవాడ విమానాశ్రయాలు ఉన్నాయి. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ఆరింటిలో విజయవంతంగా అమలుచేశాక, దశలవారీగా దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో బీబీఎస్‌ అమలులోకి తెస్తామని తెలిపారు. దేశంలో ప్రస్తుతమున్న విమానాశ్రయాలు, కొత్తగా ఏర్పాటు చేయనున్న టెర్మినల్స్‌ను ఆధునిక సాంకేతికత జోడించి విస్తరించే దిశగా ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) రానున్న నాలుగైదేళ్లలో రూ.25,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. కొవిడ్‌ లాక్‌డౌన్ల సమయంలో రద్దయిన విమాన ప్రయాణాలకు సంబంధించిన సొమ్ము వాపసు సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న విషయాన్ని మంత్రి అంగీకరించారు. ఎయిర్‌ ఇండియా గురించి అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతూ.. 2020-21లో ఎయిర్‌ ఇండియా ఆదాయం రూ.12,138.77 కోట్లు తగ్గగా.. అదే సమయంలో ఖర్చులు రూ.18,694.43 కోట్లకు పెరిగాయని పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన