దీపావళి ‘బాణసంచా’పై దిల్లీ నిషేధం

ప్రధానాంశాలు

Updated : 16/09/2021 07:39 IST

దీపావళి ‘బాణసంచా’పై దిల్లీ నిషేధం

నిల్వ, విక్రయాలు చేయొద్దంటూ వ్యాపారులకు ఆదేశాలు

దిల్లీ: దీపావళి సందర్భంగా బాణసంచా విక్రయం, వాడకంపై దిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. కాలుష్యం ప్రమాదకర స్థాయిలకు చేరుకోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. గత ఏడాది కూడా తమ ప్రభుత్వం బాణసంచాపై నిషేధం విధించిందని గుర్తు చేశారు. మూడు సంవత్సరాలుగా దీపావళి సమయంలో రాజధానిలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలకు చేరుకుంటోందని, అందుకే బాణసంచా నిల్వలు, విక్రయం, వాడకంపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నామని సీఎం ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు రక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గతేడాది ఆఖరి క్షణంలో నిషేధం విధించడం వలన, అప్పటికే బాణసంచా నిల్వలు చేసుకున్న వ్యాపారులు నష్టపోయారని, అందుకే ఈసారి ముందుగానే ప్రకటిస్తున్నామని చెప్పారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన