టీకాలను పరస్పరం ఆమోదించుకుందాం

ప్రధానాంశాలు

Published : 23/09/2021 05:32 IST

టీకాలను పరస్పరం ఆమోదించుకుందాం

గ్లోబల్‌ కొవిడ్‌ సదస్సులో మోదీ సూచన

వాషింగ్టన్‌: విదేశీ ప్రయాణికులను అనుమతించే విషయంలో ఒక్కో దేశం ఒక్కో విధానాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రపంచ దేశాలకు ఓ ప్రతిపాదన చేశారు. టీకా ధ్రువీకరణ పత్రాలను పరస్పరం ఆమోదించుకోవడం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేద్దామని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ నేతృత్వంలో బుధవారం నిర్వహించిన ‘గ్లోబల్‌ కొవిడ్‌ సమ్మిట్‌’ వేదికపై ప్రదర్శించిన వీడియో ప్రసంగంలో ప్రధాని మోదీ ఈ విషయాన్ని పేర్కొన్నారు. వ్యాక్సిన్ల తయారీని భారత దేశం వేగవంతం చేసిందని, ఇందుకు అవసరమైన ముడిపదార్థాలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తద్వారా ఇతర దేశాలకు కూడా టీకాల సరఫరాను పునరుద్ధరించగలమని చెప్పారు. ‘‘కరోనా తెచ్చిన ఆర్థిక కష్టాలను మనం పరిష్కరించుకోవాల్సి ఉంది. టీకాల ధ్రువీకరణ పత్రాలకు పరస్పర ఆమోదాలు తెలుపుకోవడం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేసుకోవాల్సి ఉంది’’ అని స్పష్టం చేశారు. బ్రిటన్‌ ఆమోదిత టీకాల జాబితాలో భారత్‌లో తయారైన కొవిషీల్డ్‌కు చోటుకల్పించినా భారత్‌ నుంచి వచ్చే వారికి నిర్ధారణ పరీక్షలు, క్వారంటైన్‌ వంటి నిబంధనలు విధించడం, అంతర్జాతీయ ప్రయాణికులకు అమెరికా విడుదల చేసిన మార్గదర్శకాలు దీనికి భిన్నంగా ఉన్న నేపథ్యంలో మోదీ ఈ ప్రతిపాదన చేయడం గమనార్హం. మన దేశ అవసరాలు తీర్చగా మిగిలే టీకాలను ఈ ఏడాది నాలుగో త్రైమాసికం నుంచి ఎగుమతి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన