తైవాన్‌ దిశగా 19 యుద్ధవిమానాలు

ప్రధానాంశాలు

Published : 24/09/2021 05:16 IST

తైవాన్‌ దిశగా 19 యుద్ధవిమానాలు

మరోసారి చైనా దురుసుతనం

తైపెయ్‌: తైవాన్‌పై చైనా మరోసారి కవ్వింపులకు దిగింది. బలప్రదర్శన ద్వారా తన దారిలోకి తెచ్చుకునేందుకు దుందుడుకు చర్యలు చేపట్టింది. గురువారం తైవాన్‌ దిశగా 19 యుద్ధ విమానాలను పంపింది. 11 దేశాల ‘కాంప్రిహెన్సివ్‌ అండ్‌ ప్రోగ్రెసివ్‌ అగ్రిమెంట్‌ ఫర్‌ ట్రాన్స్‌-పసిఫిక్‌ పార్ట్‌నర్‌షిప్‌’ కూటమిలో చేరాలనుకున్నట్లు తైవాన్‌ ప్రకటించిన నేపథ్యంలో డ్రాగన్‌ ఈ చర్యకు దిగింది. చైనా యుద్ధ విమానాలకు ప్రతిగా తైవాన్‌ తన గగనతల గస్తీ దళాలను రంగంలోకి దించింది. స్వయంపాలనలో ఉన్న తైవాన్‌పై ఇలాంటి సైనిక వేధింపులను చైనా ఇటీవలి కాలంలో ముమ్మరం చేసింది. 1949లో అంతర్‌యుద్ధం తర్వాత తైవాన్‌.. చైనా నుంచి విడిపోయింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన