ఆకాశ్‌ ప్రైమ్‌ పరీక్ష విజయవంతం

ప్రధానాంశాలు

Published : 28/09/2021 04:28 IST

ఆకాశ్‌ ప్రైమ్‌ పరీక్ష విజయవంతం

దిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ రూపొందించిన ఆకాశ్‌ క్షిపణిలోని సరికొత్త వెర్షన్‌ను భారత్‌ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. భూతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఈ అస్త్రాన్ని ఒడిశాలోని చాందీపుర్‌లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక నుంచి పరీక్షించారు. ఈ క్షిపణికి ‘ఆకాశ్‌ ప్రైమ్‌’ అని పేరు పెట్టారు. తాజా పరీక్షలో అది గగనతలంలో నిర్దేశించిన ఒక మానవరహిత విమానాన్ని అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసింది. ‘‘ప్రస్తుతమున్న ఆకాశ్‌ క్షిపణితో పోలిస్తే.. ‘ప్రైమ్‌’ వెర్షన్‌లో దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన యాక్టివ్‌ ఆర్‌ఎఫ్‌ సీకర్‌ ఉంది. లక్ష్య ఛేదనలో క్షిపణి కచ్చితత్వాన్ని ఇది బాగా మెరుగుపరచింది. ఇంకా అనేక అంశాల్లో ఈ అస్త్రాన్ని ఆధునికీకరించారు. దీనివల్ల ఎత్తయిన ప్రాంతాల్లో ఉండే శీతల వాతావరణాన్ని కూడా ఇది సమర్థంగా తట్టుకొని, మంచి పనితీరును కనబరుస్తుంది’’ అని ఓ అధికారి తెలిపారు. తాజా ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), సైన్యం, వైమానిక దళం, ఇతరులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందించారు. ఈ అస్త్రం వల్ల.. ఆకాశ్‌ వ్యవస్థపై సైన్యం, వైమానిక దళాల విశ్వాసం మరింత పెరుగుతుందని డీఆర్‌డీవో ఛైర్మన్‌ జి.సతీశ్‌ రెడ్డి తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన